ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున 'ది ఘోస్ట్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు. ది ఘోస్ట్ సినిమా అక్టోబర్ 5, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో ఏజెంట్ విక్రమ్ గా నాగార్జున కనిపించనున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాలీవుడ్ యాక్టర్ మనీష్ చౌదరి ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు.
గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్ మరియు రవివర్మ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ జి. గణేష్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి భరత్-సౌరభ్ సంగీతం అందించారు.