బాలీవుడ్ నటి సన్నీలియోన్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఫ్యామిలీ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో సన్నీ.. భర్త డేనియల్ వెబర్.. పిల్లలు నిషా.. యాష్లే.. నోవా లు అందరూ ఉన్నారు. అందరూ ఒకే రకమైన దుస్తులు ధరించి చిరునవ్వులు చిందిస్తున్నారు. ఈ ఫోటోకు “హ్యాపీ హనుక్కా ఎవ్విరి వన్.. లవ్ ది వేబర్స్.. హీహీ” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఇంతకీ హనుక్కా అంటే ఏంటో తెలుసా.. అదొక యూదుల పండగ(జూయిష్ ఫెస్టివల్). సన్నీ భర్త డేనియల్ వెబర్ ఒక జ్యూ. అందుకే వెబర్ ఫ్యామిలీ అంతా కలిసి ఇలా హనుక్కా ఫెస్టివల్ ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్లలతో కలిసి వెబర్ కుటుంబం అంతా ఫెస్టివల్ విషెస్ ఫోటోను చూసి నెటిజనులు ఇంప్రెస్ అయ్యారు. ఇప్పటివరకూ 9.74 లక్షల లైకులు వచ్చాయి. ఇదిలా ఉంటే.. డేనియల్ వెబర్ కూడా సేమ్ ఫోటోను పోస్ట్ చేసి హనుక్కా ఫెస్టివల్ విషెస్ తెలపడం విశేషం.