ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెడ్డింగ్ వావ్స్ మ్యాగజైన్ కవర్ పేజీ పై అనుపమ

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 07, 2018, 02:51 PM



అందాల ఆడబొమ్మ.. ఎంత బావుంది ముద్దుగుమ్మ!  .. అనుపమ పరమేశ్వరన్ అందం గురించి యూత్ ఫీలింగ్ ఇది. క్యూట్ లుక్స్తో ఈ భామ ఏనాడో స్పెల్ బౌండ్ చేసేసింది. `ప్రేమమ్` మొదలు కెరీర్ ని ఎదురే లేకుండా సాగించింది. అయితే ఇటీవల వరుసగా మూడు ఫ్లాప్ లు ఈ భామను బాగా ఇబ్బంది పెట్టాయి. సాయిధరమ్ సరసన నటించిన తేజ్-ఐ లవ్ యు - రామ్ సరసన నటించిన `ఉన్నది ఒక్కటే జిందగీ` - `హలో గురూ ప్రేమకోసమే` చిత్రాలు తన కెరీర్కి పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఈ సినిమాలు హిట్లు కొడితే తన కెరీర్కు మరింత బూస్ట్ దక్కుతుందనుకుంటే పూర్తి రివర్సులో పలితాలు వచ్చాయి. మొత్తానికి అనుపమ ఆశించనది ఒకటి.. అయ్యిందొకటి.


దీంతో ఈ బ్యూటీ ప్రస్తుతం ఇరుగుపొరుగు పరిశ్రమలపై దృష్టి సారించింది. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ సరసన `నటసార్వభౌమ` అనే చిత్రంలో నాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా మినహా అనుపమ వేరొక సినిమాకి సంతకం చేసిందే లేదు. ఈ గ్యాప్ లోనే ఈ భామ సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు రకరకాల ఫోటోషూట్లతో టచ్ లో ఉంది.


తాజాగా వెడ్డింగ్ వావ్స్ మ్యాగజైన్ కవర్ షూట్ లో పాల్గొంది. ఆ ఫోటోలు - వీడియోని ట్విట్టర్లో అభిమానులకు షేర్ చేసింది అనుపమ. ఈ లేటెస్ట్ ఫోటోషూట్లో నవవధువు అలంకరణలో క్యూట్ అనుపమ మైమరిపిస్తోంది. సింపుల్ గా స్మైల్ ఇస్తూ ఐటెక్స్ కాటుక కళ్లతో కుర్రాళ్ల గుండెలకు గాలం వేసిందిలా. వీడియో ఆద్యంతం అనుపమ ఫోజులు మైమరిపిస్తున్నాయి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com