తన విజయాన్ని కొలిచే విధానం ఒక్కో తారకు ఒక్కోలా ఉంటుందని చెబుతోంది అందాల తార అదితీరావ్ హైదరీ. ఎక్కువ పారితోషికం తీసుకునే వాళ్లను అగ్ర నాయికలంటారు కొందరు, పురస్కారాలు గెల్చుకునే వాళ్లను గొప్ప నటీమణులంటారు మరికొందరు. ఎక్కువ అవకాశాలు దక్కించుకునేవాళ్లు పెద్ద నాయికలన్నది కొందరి మాట. నా దృష్టిలో అత్యంత ప్రతిభావంతుల దగ్గర పనిచేయడమే గొప్పగా భావిస్తుంటాను. అలాంటి దర్శకులే నా నుంచి నిజమైన నటనను రాబట్టగలరు. గొప్ప దర్శకుల దగ్గర పనిచేయడం గౌరవంగా భావిస్తుంటాను. అని చెప్పింది. ఇక పరిశ్రమలో తాను ఎదుర్కొన్న ఇబ్బందికర అనుభవాలు చెబుతూ….నాయికలు వారసులు అయితే ఎలాంటి ఇబ్బంది ఉండ దు. బయటి వాళ్లు తారలుగా వచ్చినప్పుడే సమస్యలు వస్తాయి. నాకు తొలినాళ్లలో అలాంటి పరిస్థితులు వచ్చా యి. మూడు సినిమాల చేయిసా ్తనంటూ ఒకరు షరతు పెట్టారు. అప్పటికి నాకు పెద్దగా అవకాశాలు లేవు. అయినా నా గౌరవాన్ని తగ్గించుకుని ఏ విషయంలోనూ తలొగ్గలేదు. ఆ సినిమాలు లేకున్నా ఫర్వాలె దనుకున్నాను. ఎందుకంటే నేనలా గౌరవంగా పెరిగాను. పరిశ్రమ లో మనకిష్టమైనట్లు ఉండటం కష్టమే కానీ అసాధ్యం కాదు. అని చెప్పింది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో చిత్రాలు చేస్తోంది అదితీ.