గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా, అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్ ఇటీవల వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఆ తర్వాత దిల్లీ, ఉమైద్ భవన్లో స్నేహితులకు, కుటుంబీకులకు ఘనంగా వివాహ విందును ఏర్పాటుచేశారు. బుధవారం ముంబయిలో సినీ ప్రముఖులకు మరోసారి గ్రాండ్‌గా విందు ఇచ్చారు. వేదికపైకి ప్రియాంక తన భర్తతో కలిసి రాగానే అతడిని అందరికీ పరిచయం చేశారు.
‘విందుకు మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఇక్కడున్న ప్రత్యేక అతిథులకు నా భర్తను పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఇతనే నా భర్త.. నిక్ జొనాస్’ అని చెప్తున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందుకు నిక్ స్పందిస్తూ.. ‘భారత్‌లో ఇదే నా మొదటి షో’ అంటూ చమత్కరించారు. ప్రియాంకను గ్లోబల్‌స్టార్‌గా పేరుతెచ్చుకునేలా వెన్నుతట్టి ప్రోత్సహించినవారందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఆ తర్వాత వేడుకకు వచ్చిన అతిథులకు, మీడియా ప్రతినిధులకు నిక్ కృతజ్ఞతలు తెలిపారు. వేడుకకు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులంతా హాజరైనట్లు తెలుస్తోంది.