ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోటో స్టోరీ: రకుల్ ప్రీత్ సింగ్ బ్యూటీ ఫోటో

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 19, 2019, 06:27 PM



బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ వివాదాల్లో ఇరుక్కునే రకం కాదు. తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కానీ రీసెంట్ గా పొట్టి డ్రెస్ వేసుకున్నందుకు ఒక నెటిజన్ ట్రోల్ చెయ్యడం.. రకుల్ కు కోపం వచ్చి ఘాటుగా కౌంటర్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో హంగామా అయింది.  కొందరు రకుల్ ను విమర్శించారు. రకుల్ కు వ్యతిరేకంగా ఒక హ్యాష్ ట్యాగ్ కూడా రన్ అయింది. దీంతో రకుల్ అసలెందుకు అలా అనాల్సి వచ్చిందో వివరణ కూడా ఇచ్చింది.

ఈ స్టొరీ అంతా అయిపోయింది. సోషల్ మీడియా జనాలు ఇంకా అది గుర్తు పెట్టుకున్నారో ఏమో తెలీదుగానీ రకుల్ మాత్రం ఆ సంగతి పక్కన పెట్టేసి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక హాటు ఫోటో పోస్ట్ చేసింది.  ఆ ఫోటోకు "ఫుల్లుగా ట్రెండ్స్ ఉండే ఈ ప్రపంచంలో నేను ఓ క్లాసిక్ గా ఉండదలుచుకున్నాను!! @ ఎగ్జిబిట్ మ్యాగజైన్ # జనవరి ఎడిషన్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఇక ఫోటోలో రకుల్ పొట్టిగా ఉండే వైట్ కలర్ గౌన్లో దర్శనమిచ్చింది. ఒక కుర్చీపై రివర్స్ లో కూర్చుని ఒక హాట్ పోజ్ ఇచ్చింది. టోన్డ్ లెగ్స్ ను ఎక్స్ పోజ్ చేస్తూనే ఫేస్ లో ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. బ్యాక్ గ్రౌండ్ కూడా వైట్ కలర్ లోనే ఉండడం తో నిజంగానే ఫోటో క్లాసిక్ గా ఉంది.

నెటిజనులు కూడా ఈ ఫోటోతో ఫుల్ గా ఇంప్రెస్ అయ్యారు. ఒకరు బ్యూటీ బహుత్ సెక్సీ హై అంటే మరొకరు బ్యూటిఫుల్ యాజ్ యూజువల్ అన్నారు. ఇంకొకరు సఫేద్ రంగ్ మే సెక్సీ రాకుల్ అని కూడా కామెంట్ చేశారు. ఏదైతేనేం.. ఎగ్జిబిట్ మ్యాగజైన్ కోసం అందాల ఎగ్జిబిషన్ చేసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com