ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కస్టడీ' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 05:41 PM



తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన 'కస్టడీ' సినిమా మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కాప్ డ్రామా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 6.79 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రంలో నాగచైతన్య సరసన బబ్లీ బ్యూటీ కృతి శెట్టి జోడిగా కనిపించనుంది. ఈ సినిమాలో అరవింద్ స్వామి, ప్రియమణి, నరేష్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, శరత్ కుమార్, ప్రేమి విశ్వనాధ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఈ తెలుగు-తమిళ చిత్రానికి  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో ఇళయరాజా, ఆయన తనయుడు, మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ నిర్మిస్తోంది.


'కస్టడీ' కలెక్షన్స్ :::::::::
నైజాం : 1.76 కోట్లు
సీడెడ్ : 61 L
UA : 73 L
ఈస్ట్ : 48 L
వెస్ట్ : 30 L
గుంటూరు : 51 L
కృష్ణ : 47 L
నెల్లూరు : 29 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 5.01 కోట్లు (9.28 కోట్ల గ్రాస్)
KA + ROI : 39 L
OS : 1.27 కోట్లు
తమిళం - 34 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 6.79 కోట్లు (14.35 కోట్లు గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com