మా మధ్య ప్రేమబంధాన్ని పెంచేది ఇదే : రాధిక పండిట్

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 16, 2019, 10:49 AM

కేజీఎఫ్ చిత్రంతో సంచలన విజయం అందుకున్నాడు కన్నడ హీరో యశ్. ఒకే ఒక్క సినిమా ఓవర్ నైట్ స్టార్ డమ్ ని తెచ్చి పెట్టింది. కేజీఎఫ్ 50 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఏకంగా రూ.243 కోట్లు వసూలు చేసింది. ఒక డ్రైవర్ కొడుకు సాధించిన అసాధారణ విజయం ఇది అంటూ ప్రశంసలు దక్కాయి. యశ్ ఇప్పుడు డ్రైవర్ కొడుకు మాత్రమే కాదు.. అతడు పాన్ ఇండియా హీరో. సౌత్ నుంచి ప్రభాస్ తర్వాత అంతటి స్టార్ డమ్ ని సంపాదించేశాడు. బాలీవుడ్ లో ఖాన్ లే అతడి గురించి ప్రస్థావించే సన్నివేశం వచ్చింది.


 


మొత్తానికి యశ్ హవా మునుముందు కేజీఎఫ్ - ఛాప్టర్ 2 ఇంకా పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే కేజీఎఫ్ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తే .. ఆయన భార్య ఎవరు? ఆ ఇద్దరి మధ్యా అన్యోన్యత ఎలా ఉంటుంది? అన్నది ఇదిగో ఈ పోటోనే బయటపెడుతోంది. లవర్స్ డే రోజున ఈ ఫోటోని ఈ క్యూట్ వైఫ్ రాధిక షేర్ చేశారు. ఆసక్తికరంగా యశ్ పై భార్యామణి కొన్ని ఫిర్యాదులు చేసింది. అయితే అదంతా తనపై ప్రేమతోనే. ``మేం పెర్ఫెక్ట్ కపుల్ కాదు. కొట్టుకుంటాం.. తిట్టుకుంటాం.. కీచులాడుకుంటాం.. అభిప్రాయాలు వేర్వేరుగా ఉంటాయి. కానీ వాటి వల్లనే మేం బాగా ఒకరినొకరం అర్థం చేసుకుంటాం. మా మధ్య ప్రేమబంధాన్ని పెంచేది ఇదే`` అంటూ వ్యాఖ్యను యశ్ భార్యామణి రాధిక పండిట్ షేర్ చేశారు. మొత్తానికి ప్రేమైక బంధంలో యశ్ కి భార్య సపోర్ట్ ప్రశంసించదగినదేనని అర్థమవుతోంది. 


నిన్నటిరోజున ప్రేమికుల రోజు సందర్భంగా మహేష్- నమ్రత సూర్య - జ్యోతిక రామ్ చరణ్ - ఉపాసన బన్ని- ప్రణతి జంటలు సామాజిక మాధ్యమాల్లో ప్రేమికులకు శుభాకాంక్షలతో పాటు వ్యక్తిగత సంగతుల్ని ముచ్చటించారు. ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలంతా సామాజిక మాధ్యమాల్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం ఆసక్తికరం.


 


 
Recent Post