ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అర్జున్ 'పుష్ప 2' రికార్డును బ్రేక్ చేసిన విజయ్ 'లియో'

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 18, 2023, 07:41 PM



కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తన తదుపరి సినిమాని తలపతి విజయ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'లియో' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లియో అక్టోబర్ 19, 2023న సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. విజయ్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ లో లియో యొక్క మొదటి తెలుగు పోస్టర్‌ను పంచుకున్నాడు. ఈ పోస్టర్ కేవలం 32 నిమిషాల్లో 1 మిలియన్ లైక్‌లను సేకరించి అల్లు అర్జున్ యొక్క పుష్ప 2: ది రూల్ మునుపటి రికార్డును అధిగమించింది.  

విజయ్ సరసన ఈ సినిమాలో త్రిష జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ మరియు డ్యాన్స్ మాస్టర్ శాండీ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com