కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన తదుపరి చిత్రాన్ని వెంకట్ ప్రభుతో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా తలపతి 68 అనే టైటిల్ పెట్టారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం యొక్క OTT హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్ భారీ ధరకు కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఈ మెగా ప్రాజెక్ట్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. AGS ఎంటర్‌టైన్‌మెంట్ ఈ మూవీని నిర్మించనుంది.