ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంతో మంచి సినిమాలు చేశా

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 02:58 PM



‘సాట్టై’ చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మహిమా నంబియార్‌ .. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా నటించిన ‘800’, ‘చంద్రముఖి-2’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘‘చంద్రముఖి-2 చిత్రంలో రాఘవ లారెన్స్‌ సరసన నటించా. ఇందులో పలువురు సీనియర్‌ కళాకారులతో కలిసి పనిచేయడం మంచి అనుభవం. క్రికెట్‌ లెజెండ్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘800’లో హీరో భార్యగా నటించా. మురళీధరన్‌ క్రికెటర్‌గా మాత్రమే మనకు తెలుసు. కానీ, ఆయన ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఉన్న కష్టాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఈ చిత్రంలో చూస్తారు. ఈ మూవీ వచ్చే నెలలో విడుదలకానుంది అని తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com