ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కింగ్ అఫ్ కొత్త' 19 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 02:57 PM



అభిలాష్ జోషి దర్శకత్వంలో మాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'కింగ్ ఆఫ్ కొత్త' సినిమా ఇటీవలే గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. అభిలాష్ ఎన్.చంద్రన్ కథను అందించిన ఈ గ్యాంగ్‌స్టర్ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 18.68 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ పాన్-ఇండియన్ మూవీలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో డ్యాన్సింగ్ రోజ్, ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలకన్, శాంతి కృష్ణ, వడ చెన్నై శరణ్, అనిఖా సురేంద్రన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్ మరియు వేఫేరర్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. జేక్స్ బిజోయ్ మరియు షాన్ రెహమాన్ సంయుక్తంగా సంగీతం అందించగా, నిమిష్ రవి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.


'కింగ్ అఫ్ కొత్త' కలెక్షన్స్:::::::
కేరళ - 5.84 కోట్లు
తెలుగు రాష్ట్రాలు - 2.25 కోట్లు
తమిళనాడు - 0.93 కోట్లు
కర్ణాటక - 0.69 కోట్లు
ROI - 0.46 కోట్లు
ఓవర్సీస్ - 7.17 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 18.68 కోట్ల గ్రాస్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com