ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డెవిల్' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 03:52 PM



నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'డెవిల్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవలే విడుదలైన టీజర్‌తో సినిమాపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మొదటి సింగిల్ ని మాయే చేసీ అనే టైటిల్ తో సెప్టెంబర్ 19న అంటే ఈరోజు సాయంత్రం 4.05 గంటలకి విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.
 
ఈ స్పై థ్రిల్లర్ డెవిల్ లో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ జోడిగా కనిపించనుంది. ఈ చిత్రం నవంబర్ 24, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అభిషేక్ పిక్చర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాలో కళ్యాణ్ రామ్ ఒక చీకటి రహస్యాన్ని ఛేదించే లక్ష్యంతో నిర్భయ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపిస్తారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com