ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎట్టకేలకు OTT ఎంట్రీ ఇచ్చిన 'ధూమమ్‌'

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 30, 2023, 03:25 PM



యు-టర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వంలో ఫహద్ ఫాసిల్ నటించిన 'ధూమమ్‌' సినిమా జూన్ 23, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైంది. తాజాగా ఇప్పుడు ఆపిల్ టీవీలో రెంటల్ బేస్ పై 150 రూపాయలకి ఈ మలయాళ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ మరియు తమిళంలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది.

థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ పాన్-ఇండియన్ చిత్రంలో అపర్ణా బాలమురళి కథానాయికగా నటించింది. KGF మరియు కాంతారా వంటి బ్లాక్‌బస్టర్‌లను నిర్మించడంలో పేరుగాంచిన హోంబలే ఫిల్మ్స్ ధూమమ్ సినిమాని నిర్మిస్తుంది. ఈ పాన్-సౌత్ చిత్రంలో రోషన్ మాథ్యూ, అచ్యుత్ కుమార్ మరియు వినీత్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి SV సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com