ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మజిలీ' చిత్రం గురించి సమంత-నాగ చైతన్య మాటలు మీకోసం

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2019, 03:48 PM



టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ కపుల్ అంటే వెంటనే టక్కున గుర్తొచ్చే పేరు సమంత- నాగ చైతన్య ల జంటే. వీరిద్దరూ అటు సినిమాలలోనూ ఇటు వారి బంధాన్ని చక్కగా ప్లాన్ చేస్తూ జీవితాన్ని హాయిగా కొనసాగిస్తున్నారు. 

వీరి మధ్య ఇప్పటికే 3 సినిమాలు వచ్చాయి. చివరగా వచ్చిన మనం మూవీ అక్కినేని అభిమానులకు మంచి సినిమాగా మిగిలిపోయింది. ప్రస్తుతం వీరిద్దరూ పేల్లి ఐన తర్వాత మొట్ట మొదటిసారిగా 'మజిలీ'  చిత్రం తో రాబోతున్నారు ఈ సినిమాలో చైతూ - సమంత భార్యాభర్తలుగానే కనిపించనున్నారు. అందువలన "నిజ జీవితానికీ .. ఈ కథకి మధ్య ఏ విషయంలోనైనా పోలికలు ఉన్నాయా? సంఘటనలు .. సన్నివేశాలు కలిసిన సందర్భాలేమైనా ఉన్నాయా?" అనే ప్రశ్నలు తాజా ఇంటర్వ్యూలో సమంతకి ఎదురయ్యాయి.

ఈ ప్రశ్నలన్నింటికీ సమంత  స్పందిస్తూ .. 'మజిలీ' సినిమాకి .. మా నిజ జీవితానికి మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఆ సినిమాలోని పాత్రలకు .. మాకు మధ్య ఎలాంటి పోలికలు వుండవు. ముఖ్యంగా 'మజిలీ'లో చైతూ పాత్రకు .. ఆయన రియల్ క్యారెక్టర్ కి అసలు సంబంధమే ఉండదు. కథలోని కొత్తదనం కారణంగానే మేమిద్దరం ఈ సినిమాను చేశాము. కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడొచ్చు" అని ఆమె చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com