ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతర్జాతీయ అవార్డులకి నామినేషన్ పొందిన 'జవాన్'

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 04:54 PM



బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన 'జవాన్' బాక్స్ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అట్లీ దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా 1150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లో దాదాపు 590 కోట్ల నెట్‌తో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా దాదాపు 400 కోట్ల వరకు వసూలు చేసింది. జవాన్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చరిత్ర క్రియేట్ చేసింది.  

హాలీవుడ్ క్రియేటివ్ అలయన్స్ (HCA) నిర్వహించనున్న అస్త్ర అవార్డ్స్ (అస్త్ర ఫిలిం అండ్ క్రియేటివ్ ఆర్ట్స్ అవార్డ్స్)లో నామినేట్ అయిన ఏకైక భారతీయ చిత్రంగా జవాన్ నిలిచింది. షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రం "ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం" విభాగంలో నామినేషన్ పొందింది.


ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, సన్యా మల్హోత్రా, ప్రియమణి, గిరిజా ఓక్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ఈ భారీ డ్రామాని నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com