ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంద‌రికీ ధ‌న్య‌వాదాలు : మా అధినేత న‌రేష్‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 22, 2019, 09:46 PM



. 25 సంవత్సరాలుగా మా అభివృధ్ధికోసం ఎంతో మంది అధ్యక్షులు కృషి చేశారు.. వారందరికీ ధన్యవాదాలు.. మా ప్రతిష్ట ని మరింత పెంచేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను అని అన్నారు మా అధినేత న‌రేష్‌. మా' అధ్యక్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన అనంత‌రం మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ , విజయనిర్మల గారికి, రెబల్ స్టార్ కృష్ణం రాజు , శ్యామల గారికి, కోట శ్రీనివాసరావు గారికి, సహజనటి జయసుధ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఈ ఎన్నికల్లో పాల్గొన్న ప్రతిఒక్కటికి కృతజ్ఞతలు... మా అసోసియేషన్ లో ఉన్న ప్రతిఒక్కరు ఎంతో సంతోషంగా ఉండాలి.. ఇది జరగాలంటే ప్రతిఒక్కరు క్రమశిక్షణతో , విధేయతతో గౌరవంతో పనిచేయాలి.. 'మా' గీతం నేను ' మా ' అమ్మకి ఇచ్చే మొదటి బహుమతి.. రెండో బహుమతిగా నా నుంచి ఒక లక్ష వెయ్యి నూటపదహార్లు నా సోదరుల సంక్షేమం కోసం ఇస్తున్నాను.. మా అమ్మ విజయనిర్మల గారు ప్రతినెలా 15000 ఇస్తున్నారు.. మా అసోసియేషన్ మా ఇంట్లో మొదలైంది.. అలాంటి ' మా 'అమ్మ ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే బాధ్యత నాది.. మా అసోసియేషన్ సభ్యత్వం ఇందుకు ముందు ఉన్న దానికంటే 10,000 వేలు తగ్గిస్తూ 90,000 చేస్తున్నాం..ఇది నా మూడో గిఫ్ట్.. 24 హావర్స్ హెల్ప్ లైన్ ని ఏర్పాటు చేసాం.. సజెషన్ బాక్స్ ను ఏర్పాటు చేసి అందరి విన్నపాలు స్వీకరిస్తాం.. మహిళల సాధికారత కోసం, వారి సంక్షేమం కోసం జీవిత గారి ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అలాగే శివబాలాజీ ఇన్ ఛార్జ్ గా యూత్ ని లీడ్ చేసే ఓ కార్యక్రమం చేస్తున్నాం.. జాబ్ కమిటీని గౌతమ్ రాజు గారు లీడ్ చేస్తూ అందరికి ఉపాధి లభించేలా చేస్తున్నాం..పెన్షన్ ని వెయ్యి రూపాయలు పెంచుతున్నాం.. ప్రతినెలా మెడికల్ క్యాంపు ను ఏర్పాటుచేస్తున్నాం.. సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి చాలా కృతజ్ఞతలు.. మేము వెళ్లిన వెంటనే స్పందించి ఏ సహాయం కావాలన్నా చెప్పండి అని అన్నివిధాలుగా సహకరించిన వారికి, తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. అన్నారు..


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com