సార్వత్రిక ఎన్నికల పుణ్యామా అని ఎపుడు స్నేహంగా ఉండే పవన్ కళ్యాణ్, అలీలు అని ఒకరిపై ఒకరు బురద చల్లుకున్నారు. ఎంతటి వారైనా రాజకీయాల్లోకి వెళ్లాక మారాల్సిందే. అలీని నేను స్నేహితుడని నమ్మి సాయం చేస్తే..నాకు నమ్మక ద్రోహం చేశాడని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిండం చర్చనీయాంశమైంది. మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు అలీ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నేనేమి ఎవరి దయా దాక్షిణ్యాలపై సినిమా ఇండస్ట్రీలో రాలేదు. నా స్వశక్తితో ఇండస్ట్రీలో పైకొచ్చాని పవన్ కు కాస్త ఘాటుగానే సమాధానమిచ్చాడు అలీ. మరోవైపు పవన్ కళ్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు అలీ చాలా బాధ పడ్డారని ప్రముఖ కమెడియన్ పృథ్వీ వెల్లడించాడు.పవన్ కళ్యాన్, అలీ స్నేహాన్ని చూసి మేమంత కుళ్లుకునే వాళ్లమన్నారు. ఏ సినిమాలో చూసిన పవన్ కళ్యాణ్..అలీని కాకుండా వేరే ఎవరినీ పెట్టుకోడా అని అనుకునేవారం. షూటింగ్లో ఒకరితో ఇంకొరు ఎంతో స్నేహ పూర్వంగా మెలిగేవారు. మాలాంటి వాళ్లు ఆయన పిలిస్తే మహా భాగ్యం అంటూ వెళ్లేవాళ్లం అని పృథ్వీ గుర్తు చేసారు. మేమంత చెన్నై నుంచి ట్రావెల్ చేేసిన వచ్చిన వాళ్లం. అలీ..కష్టం అనే తొట్లో మునిగి బయటకు వచ్చిన వ్యక్తి . తను చేసిన గొప్ప పనులు ఎప్పుడు చెప్పుకోడు. వాళ్ల నాన్న పేరు మీద ఒక ట్రస్ట్ కూడా పెట్టాడని 30 ఇయర్స్ పృథ్వీ తెలిపారు.