గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి వేడెక్కించే తాజా లుక్ తో అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈసారి టైట్ ఫిట్ డెనిమ్ జీన్స్.. ఆ పైన సింపుల్ వైట్ నెక్ టాప్.. దానిపైన లాంగ్ కోట్ తో దర్శనమిచ్చింది. వైట్ టాప్ పై గళ్ల కోటు సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. కూల్ గ్లాసెస్ ధరించి.. చెదిరిపోయిన ఆ తలనీలాల్ని సవరించుకుంటోంది పీసీ. చేతిలో బ్లాక్ డఫెల్ బ్యాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటన్నిటినీ మించి డెనిమ్ కి కాస్త అప్ లో నాభి కేంద్రంపైకి యూత్ కళ్లు తిప్పేయడం మరో హైలైట్. ఆ నాభికి ప్రత్యేకించి ఓ రింగును కుట్టించుకుంది పీసీ. ఇలాంటి ఫ్యాషన్స్ హాలీవుడ్ సినిమాల్లోనే రెగ్యులర్ గా చూస్తుంటాం.