ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి కలిసి నటించేందుకు సిద్ధమవుతున్న చై, సామ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2019, 05:19 PM



శివ నిర్వాణ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ‘మజిలీ’ చిత్రం ఇటీవల విడుదలై మంచి సక్సెస్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. పెళ్లి తరువాత ఈ జంట కలిసి నటించిన మొదటి చిత్రం కావడంతో ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా మంచి హిట్ టాక్‌ను సంపాదించుకోవడంతో చై, సామ్ జంట ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 


ఇప్పుడు అదే జోష్‌తో ఈ జంట మరోసారి కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ‘RX 100’ సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి చై, సామ్‌లకు ఓ కథను వినిపించారని, దీనికి వారిద్దరూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com