ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓవర్సీస్ పార్టనర్ ని లాక్ చేసిన 'హరోమ్ హర'

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 05:27 PM



నైట్రో స్టార్ సుధీర్ బాబు ప్రస్తుతం జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తన రాబోయే చిత్రం హరోమ్ హర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా టీజర్ మూవీపై భారీ బజ్ ని క్రియేట్ చేసింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఓవర్సీస్  రైట్స్ ని ది విలేజ్‌ గ్రూప్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.

ఈ ప్రాజెక్ట్‌లో మాళవిక శర్మ కథానాయికగా నటించింది. సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్, రవి కాలే మరియు ఇతరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సుమంత్ నాయుడు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com