ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక

cinema |  Suryaa Desk  | Published : Sat, May 04, 2024, 08:20 PM



టాలీవుడ్ నటుడు నితిన్ వేణు శ్రీరామ్‌తో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ తమ్ముడు అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా సెట్స్ లో డైరెక్టర్ వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చిత్ర బృందం పోస్ట్ చేసింది.

ఈ సినిమాలో కథానాయిక, ఇతర కీలక నటీనటులను త్వరలో మూవీ మేకర్స్ ప్రకటిస్తారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com