ప్రభుదేవా, మిల్కీబ్యూటీ జంటగా, ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్.. అభినేత్రి.. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. నందితా శ్వేత మరో హీరోయిన్గా నటించింది. తెలుగులో 'అభినేత్రి-2', తమిళ్లో 'దేవి-2' పేర్లతో రూపొందింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అభినేత్రి-2 నుండి రెడీ రెడీ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.
ఈ పాటలో మిల్కీబ్యూటీ అందాల ఆరబోత ఓ రేంజ్లో ఉంది. వనమాలి లిరిక్స్ రాయగా, నిన్సీ విన్సెంట్ పాడింది. కోవై సరళ, సోనూసూద్, అజ్మల్, సప్తగిరి ఇంపార్టెంట్ రోల్స్ చేసిన అభినేత్రి-2, మే 31న తెలుగు, తమిళ్ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.ఈ సినిమాకి కెమెరా : అయాంక బోస్, ఎడిటింగ్ : ఆంటొనీ, కొరియోగ్రఫీ : పరేష్ శిరోద్కర్, ఫైట్స్ : స్టంట్ సెల్వ