కాజల్ అగర్వాల్.... తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమయిన పేరు. కెరీర్ మొదలై 12 ఏళ్లైయింది. అయినా అప్పటికీ ఇప్పటికీ అదే జోరు చూపిస్తుంది ఈ అందాల చందమామ. ఇప్పటికీ వరస సినిమాలతో రప్ఫాడిస్తూనే ఉంది. ముఖ్యంగా అమ్మడు ఫుల్ గ్లామర్ పోజులతో అదరగొడుతున్న ఈ మిత్రవిందను చూసి కుర్రాళ్ల మతులు పోతున్నాయి. సింపుల్‌గా చూపులతోనే చంపేస్తుంది ఈ ముద్దుగుమ్మ. చిన్న హీరోలతో పాటు పెద్ద సినిమాలతోనూ బిజీగా ఉంది కాజల్ అగర్వాల్.
తాజాగా ఆమె నటించిన సీత చిత్రం ఈనెల 24న విడుదల కాబోతోంది. ఈ మూవీలోనూ కాజల్ తన పెర్ ఫార్మెన్స్ తో అదరగొట్టింది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఫోటోషూట్ చేసింది కాజల్. ఈ ఫోటోషూట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె పోజులు పిచ్చెక్కిస్తున్నాయంటే నమ్మండి.ఇన్నేళ్ళుగా నటన తప్ప మరో ధ్యాసే పెట్టలేదు కాజల్. పెళ్లి కూడా చేసుకోకుండా సినిమాలతోనే బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు ఈ భామకు మరో ఆశ కూడా పుట్టింది.నిర్మాత అవతారంలో కనిపిస్తానంటోంది కాజల్. నమ్మడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది కానీ ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండి నిర్మాణం ఎలా చేయాలో బాగానే నేర్చేసుకుంది కాజల్. అందుకే ఇప్పుడు తన సొమ్మును ఇక్కడే ఖర్చు చేయాలని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. కాజల్ అగర్వాల్ కి జ్యూవెలరీ బిజినెస్ తో పాటు షూస్ కంపెనీ ఉంది. చెల్లి నిషా అగర్వాల్ ఇవన్నీ చూస్తుంది.
నటనతో పాటు సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెడుతున్నట్టు ప్రకటించింది కాజల్. KA వెంచర్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తానంటోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా కన్ఫర్మ్ చేసింది కాజల్. సీత ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న చందమామ.. తాను నిర్మాతగా మారనున్నట్లు చెప్పింది. ఇన్నాళ్లూ తనలోని నటిని మాత్రమే చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తనలో ఉన్న నిర్మాతను చూపిస్తానంటుంది ఈ చందమామ. మరి నిర్మాతగా ఈ భామ ఎలాంటి మూవీస్ తీస్తుందో చూడాలి.