ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డార్లింగ్' ఆంధ్రప్రదేశ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 05:19 PM



అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి డార్లింగ్‌ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌లో నభా నటేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఆంధ్రప్రదేశ్ రైట్స్ ని ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించనున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన కె నిరంజన్ రెడ్డి శ్రీమతి చైతన్య సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జులై 19న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com