ట్రెండింగ్
Epaper    English    தமிழ்

5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' ఫస్ట్ సింగల్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2024, 03:52 PM



మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజతో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ సినిమాకి మిస్టర్ బచ్చన్ - నామ్ తో సునా హోగా అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. భారతీయ పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్‌పై దాదాపు 3 రోజుల పాటు జరిగిన నిజ జీవిత ఆదాయపు పన్ను దాడి ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని సితార అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో 5 మిలియన్ వ్యూస్ తో టాప్ ట్రేండింగ్ లో ఉన్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. రవితేజ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సత్య, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com