హీరోగా మంచి ఫాంలో ఉన్ననాని ఆమధ్య వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్‌ను స్థాపించి అ! అంటూ ఓ సినిమాను నిర్మించాడు టెస్ట్ ఉన్న నిర్మాతగా నానికి ఈ సినిమా మంచి పేరు అయితే తెచ్చింది కానీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. అయితే కథా పరంగా ఈ మూవీ చాలా మందిని ఆకట్టుకున్నా కాసులు కురిపించలేక చతికిల్లపబడింది. అయినా సరే, కొత్తనం కోరుకునే నాని మరోమారు నిర్మాతగా సిద్దమైపోయాడు . త్వరలోనే మరో మూవీని నిర్మిస్తున్నట్టు ప్రకటించాడు. అన్నట్టు ఈ సినిమాలో హీరోగా ఫలక్నామా దాస్ సినిమాలో హీరోగా నటించిన విశ్వక్సేన్ ని ఎంపిక చేసాడట. మరి విశ్వక్ కేవలం ఈ సినిమాకి హీరోగా నటిస్తాడా లేక దర్శకత్వం కూడా తానే చేస్తాడా అన్న విషయం తేలాల్సి ఉంది.