నటి షాలినీ పాండే ధోరణి కారణంగానే ఆమెకి వచ్చే సినిమా అవకాశాలు వెనక్కి వెళుతున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. తన పాత్ర పరిథి ఎక్కువగా ఉండాలనీ, తక్కువగా వుంటే చేయనని షాలినీ పాండే చెప్పేస్తోందట. అలాగే తన డేట్స్ కావాలంటే తాను అడిగినంత పారితోషికం ఇవ్వాల్సిందేనని అంటోందట. ఆమె ఇలా భీష్మించుకుని కూర్చోవడం వల్లనే అవకాశాలు తగ్గిపోతున్నాయని సమాచారం.