విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా జగపతిబాబు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మహేశ్ 26వ చిత్రం `సరిలేరు నీకెవ్వరు` నుండి తప్పుకున్నారని .. తప్పించారంటూ పలు వార్తలు వినపడ్డాయి. ఇలాంటి తరుణంలో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దీనిపై వివరణ ఇచ్చారు. అలాగే ఇప్పుడు జగపతిబాబు కూడా వివరణ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
సినిమా ఇండస్ట్రీ నా ఫ్యామిలీ లాంటిది. నా ఫ్యామిలీ గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఓ క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. 33 ఏళ్లలో ఇలాంటి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఫస్ట్ టైమ్ ఇస్తున్నాను. మహేశ్, అనిల్‌రావిపూడి సినిమాలో నుండి నేను తప్పుకున్నాను అని రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఆ వార్తల్లో నిజం లేదు. ఇప్పటికీ ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చిన క్యారెక్టర్. ఇప్పటికీ చేయమంటే రెడీగా ఉన్నాను. ఆ సినిమా కోసం రెండు సినిమాలు వదులుకుందన్నమాట కూడా నిజం. కానీ కొన్ని పరిస్థితుల్లో ఇండస్ట్రీలో కొన్ని కొన్ని జరుగుతుంటాయి. అలాంటి తప్పవు. అలాంటి పరిస్థితుల వల్ల ఆ సినిమాలో నేను లేను. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అన్నారు జగపతిబాబు.