అనిల్ సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు నిర్మాతలుగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతోంది. ఈ సినిమాలో ఒక పాత్రలో నటిస్తున్న జగపతిబాబు ఇటీవల సినిమా నుంచి తప్పుకున్నారనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై జగపతి బాబు క్లారిటీ ఇచ్చారు. సినిమా నుంచి తప్పుకోవడం నిజమే అని చెప్పిన ఆయన, తన సినీ జీవితంలో ఒక విషయం పై వివరణ ఇవ్వడం ఇదే మొదటిసారని చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన ఇలా చెప్పారు. " చిత్ర పరిశ్రమ నా ఫ్యామిలీలాంటిది. అందుకే దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టంలేదు. కానీ, ఒక విషయంలో స్పష్టత ఇవ్వక తప్పడం లేదు. నా 33ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇలా వివరణ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఇదే మొదటిసారి. అనిల్‌రావిపూడి-మహేశ్‌బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా నుంచి నేను తప్పుకొన్నానని సోషల్‌మీడియాలో రకరకాల పుకార్లు వస్తున్నాయి. అందులో నిజం లేదు. ఇప్పటికీ ఆ పాత్ర నాకు బాగా నచ్చింది. చేయడానికి రెడీగా ఉన్నాను. ఆ సినిమా కోసం మరో రెండు సినిమాలు వదులుకోవడం కూడా నిజం. కానీ, ఇండస్ట్రీలో కొన్ని కారణాల వల్ల ఇంకొన్ని విషయాలు జరుగుతాయి. తప్పవు. ఆ పరిస్థితి వల్ల సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ సినిమాను, పాత్రను మిస్ అవుతున్నా. ఏదేమైనా చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్" అని జగపతి బాబు చెప్పుకొచ్చారు. మొత్తమ్మీద సరిలేరు నీకెవ్వరు సినిమా జగపతిబాబుకు చెప్పలేని ఇబ్బంది కలిగించినట్టే కనిపిస్తోంది.