రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరపైకి వస్తున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టయినర్ మూవీ 'సాహో' కు ఇప్పటికే ఘూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉంది. ఈ క్రమంలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని ప్రమోషన్ పనులు చకచక చేసుకుంటూ పోతోంది సాహో చిత్ర యూనిట్. అయితే ఉన్నట్టుండి సాహో టీం రిలీజ్ విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు తెలిసింది.
వెనకడుగు ఎందుకుంటే ...?
మూవీ నాణ్యతలో రాజీపడకపోనంటున్న చిత్ర యూనిట్... కొన్ని యాక్షన్ సన్నివేశాలు మరింత నాణ్యతతో ఉంటే బాగుంటుందని చివరి నిమిషంలో గుర్తించింది. ప్రస్తుతం వాటికి మరిన్ని మెరుగులు దిద్దుతూ.. సరికొత్త హంగులు జోడిస్తున్నారు. అయితే టాస్క్ రిలీజ్ డేట్ ఆగస్టు 15 కల్లా పూర్తి కావని నిర్ణయానికి వచ్చి చిత్ర యూనిట్ ...మూవీ రిలీజ్ ను మరో 15 రోజులు వాయిదా వేసినట్టు తెలిసింది. దీనికి ప్రకారం చూసినట్లయితే సాహో మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నమాట.
ఆ రెండిటితో సాహోకు ముప్పు !!
కమర్షియాల్ యాంగిల్ లో ఆలోచిస్తే '' సాహో'' మూవీ భారీ వసూళ్లు రాబట్టాలని చిత్ర నిర్మాతలు డిసైడ్ అయ్యారు. అయితే ముందుగా ఫిక్స్ చేసుకున్నట్లు ఆగస్టు 15న రిలీజ్ చేస్తే శర్వానంద్ ‘రణరంగం’, అడివి శేష్ ‘ఎవరు’ చిత్రాలు కూడా అదే రోజు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇవి సాహోకు పోటీ కాకపోయినప్పటికీ కొంతైనా కలెక్షన్ల విషయంలో ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. ఆ కొంతైనా ఎందుకు వదులుకోవాలి అనే కోణంలో ఆలోచిస్తున్న చిత్ర నిర్మాతలు సాహో మూవీ విడుదల తేదీని ఆగస్టు 30కి మార్చినట్లు తెలిసింది.