అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ 22 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. పవన్‌కల్యాణ్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో హీరోయిన్గా నటించింది సుప్రియ. ఆ తర్వాత మరే చిత్రంలో నటించలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ చిత్ర నిర్మాణాలు పర్యవేక్షణ బాధ్యత స్వీకరించారు. ఇప్పుడు గూఢచారి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో నదియా ఖురేష్ పాత్రలో ఆమె కనిపించనుంది. రా ఏజెన్సీకి చెందిన త్రినేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీకి వర్క్ చేసే సీక్రెట్ ఏజెంట్ పాత్రలో సుప్రియ నటిస్తోంది. గూఢచారిలో సుప్రియ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, సినిమాకు కీలకం అవుతుందని చిత్ర బృందం పేర్కొంది. 116 రోజులు, 168 లొకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ చిత్రంగా అభిషేఖ్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తు న్నారు. ఆగస్టు 3న గూఢచారి చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అడవి శేష్, శోభిత దులిపాళ్ల, ప్రకాష్ రాజ్, మధుషాలిని, అని, కురివెల్ల, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రధారులు.