ఎస్.ఎస్.ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై రాహుల్ భాయ్ మీడియా మరియు దుర్గశ్రీ ఫిల్మ్స్ సంయుక్తంగా జిపిఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షివర్మ హీరో హీరోయిన్స్ గా నిర్మిస్తున్న చిత్రం `ప్రేమ పిపాసి` మురళీరామస్వామి ( ఎమ్ ఆర్ ) దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రం టీజర్ ఆదివారం ప్రసాద్ లాబ్స్ లో గ్రాండ్ గా జరిగింది.
.ఈ సందర్భంగా ముఖ్యఅతిధిగా విచ్చేసిన పి.వి.ఆర్ విష్ణు మాట్లాడుతూ… “ప్రొడ్యూసర్ రామకృష్ణ నాకు గత ఆరు నెలలుగా పరిచయం. సినిమాల పట్ల అభిరుచి ఉన్న నిర్మాత . ఇక టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. టీజర్ చూసాక దర్శకుడు మురళి కష్టం ఏంటో కనిపిస్తుంది. మూవీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా“ అన్నారు.
చిత్ర నిర్మాత పి. ఎస్ రామకృష్ణమాట్లాడుతూ… “ నిర్మాతగా ఇది నా ఫస్ట్ సినిమా. హీరో జిపిఎస్ పెర్ఫార్మెన్స్ టీజర్ లో చూసింది కొంచమే . ఈ సినిమా తో మరో సేన్సేషనల్ హీరో పరిచయమవుతున్నాడు. ఇక మా డైరెక్టర్ మురళి గారు అన్నీ తానై ఈ సినిమాకు పని చేసారు. టీజర్ బట్టి తన టాలెంట్ ఏంటో మీకు తెలిసి ఉంటుంది. ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగం గా జరుగుతున్నాయి. నా ఫ్రెండ్ యుగంధర్ వల్లే నేను ఈ సినిమాని ముందుకు తీసుకురాగలిగాను. ఎక్కడా ఖర్చుకి వెనకాడలేదు. సినిమా చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. అతి త్వరలో ఆడియో రిలీజ్ చేసి సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.