నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార ఇటీవల విడుదలై ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ట్రైలర్ తో విపరీతమైన అంచనాలను పెంచిన ఈ సినిమా విడుదల తరువాత ఒక మ్యానియాలా తయారై థియేటర్లను యాభై రోజులపాటు దడదడలాడించింది.
లేటెస్ట్ గా ఈ మూవీ యాభై రోజుల థియేటర్ రన్ పూర్తి చేసుకుంది. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించారు. ఈ సోసియో ఫాంటసీ యాక్షన్ డ్రామాలో క్యాథెరిన్ ట్రెస్సా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించగా, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. చిరంతన్ భట్, ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.