టాలీవుడ్ యంగ్ హీరో, హీరోయిన్లు నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం "కార్తికేయ 2". ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది. హిందీలో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు, పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
మలయాళంలో ఈ రోజునే థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై నిఖిల్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. కార్తికేయ 2 క్లైమాక్స్ లోనే పార్ట్ 3 కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చూపించేసి, విపరీతమైన అంచనాలను పెంచేసిన మేకర్స్ ప్రస్తుతం కార్తికేయ 3 స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమైపోయారట. 3డి లో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అలానే పార్ట్ 2 కొచ్చిన క్రేజ్ కారణంగా పార్ట్ 3 ను మరింత బిగ్ బడ్జెట్ తో, ఇంప్రూవ్డ్ టెక్నాలజీ తో తెరకెక్కించబోతున్నట్టు తెలిపారు.